Smita Sabharwal | చిక్కుల్లో స్మితా సబర్వాల్​..

Smita Sabharwal | చిక్కుల్లో స్మితా సబర్వాల్​..
Smita Sabharwal | చిక్కుల్లో స్మితా సబర్వాల్​..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Smita Sabharwal | సీనియర్​ ఐఏఎస్​ అధికారిణి స్మితా సబర్వాల్​ను Senior IAS officer Smita Sabharwal అద్దె కారు వివాదం వెంటాడుతోంది. ఈ అంశంపై వ్యవసాయ వర్సిటీ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ BRS government హయాంలో కీలక హోదాలో పనిచేసిన స్మితా సబర్వాల్​ Smita Sabharwal ప్రస్తుతం తెలంగాణ పర్యాటకశాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కాగా.. సీఎంవోలోCMO అదనపు కార్యదర్శి Additional Secretary హోదాలో ఉన్నప్పుడు.. ఆమె ఇచ్చిన లేఖ ఇప్పడు వివాదానికి దారితీసింది.

Advertisement
Advertisement

Smita Sabharwal | రూ.61 లక్షల అవకతవకలు

స్మితా సబర్వాల్ సీఎంవోలో అదనపు కార్యదర్శిగా Additional Secretary in CMO ఉన్న సమయంలో ఇచ్చిన లేఖ Letter మేరకు 2016 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు ఓ కారును రెంట్​కు తీసుకున్నారు. కారుకు నెలకు రూ.63 వేల చొప్పున అద్దె రూపంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ Professor Jayashankar Agricultural University నుంచి స్మితా తీసుకున్నట్లు తెలుస్తోంది. వర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా మెుత్తం 90 నెలలకు గాను రూ.61 లక్షలు తీసుకున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆడిట్‌లో తేలింది.

Smita Sabharwal | నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం!

అద్దె కారు rental car వివాదంలో నోటీసులిచ్చేందుకు ప్రొఫెసర్​ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ Professor Jayashankar Agricultural University సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవల ఏజీ ఆడిట్ AG audit ద్వారా విశ్వవిద్యాలయంలో కొన్ని అవకతవకలు బయటపడినట్లు తెలియగా, వీటిలో ఈ అంశం కూడా ఉన్నట్లు తెలిసింది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్దాస్ జానయ్య స్మితా సభర్వాల్‌ అద్దె వాహనంపై ఆడిట్ అభ్యంతరాలు సరైనవేనని పేర్కొన్నట్లు తెలిసింది. ఏజీ ఆడిట్ ఆధారంగా అంతర్గత విచారణను జరిపించి.. సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి state government సమర్పించనున్నట్లు సమాచారం. అనంతరం నోటీసులిచ్చే ఛాన్సుంది.

Advertisement