Snakes in AC : మీ ఇంట్లో ఏసీ ఉందా? వెంటనే ఈ వీడియో చూడండి.. మీ ఏసీలోనూ పాములు ఉండొచ్చు

Snakes in AC : మీ ఇంట్లో ఏసీ ఉందా? వెంటనే ఈ వీడియో చూడండి.. మీ ఏసీలోనూ పాములు ఉండొచ్చు
Snakes in AC : మీ ఇంట్లో ఏసీ ఉందా? వెంటనే ఈ వీడియో చూడండి.. మీ ఏసీలోనూ పాములు ఉండొచ్చు
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Snakes in AC : AC ఏసీలో పాములు ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే. పాములు Snakes పుట్టల్లోనే కాదు.. ఇంట్లో ఉన్న ఏసీలో కూడా దూరుతాయి. చివరకు అందులోనే పిల్లలను కూడా పెడతాయి అని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. వైజాగ్ లోని పెందుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న ఏసీలో ఓ పాము Snake ఏకంగా పిల్లలను కూడా పెట్టేసింది. నిజానికి వాళ్లు చాలా కాలం పాటు ఏసీని వాడలేదట.

దీంతో అందులోకి దూరిన పాము ఏకంగా పిల్లలను కూడా పెట్టింది. అసలే ఎండాకాలం స్టార్ట్ కావడంతో వాళ్లు ఇప్పుడు ఏసీని ఆన్ చేయగా అందులో నుంచి పాము, దాని పిల్లలు బయటపడ్డాయి. నిజానికి ఏసీని క్లీన్ చేద్దామని వాళ్లు AC ఏసీని ఓపెన్ చేశారు. అందులో పాము Snake పెట్టిన గూడు కనిపించింది. అంతే కాదు.. అందులో పాము పిల్లలు కూడా ఉన్నాయి. వెంటనే స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్ కు కబురు పెట్టారు.

Snakes in AC : ఏసీలోనే దాక్కున పాము పిల్లల తల్లి

స్నేక్ క్యాచర్ వచ్చి ఏసీని మొత్తం చెక్ చేసి ఏసీలో దాక్కున తల్లి పాము, దాని పిల్లలు అన్నింటినీ బయటికి తీశాడు. ఏసీలో నుంచి పదుల సంఖ్యలో పాము పిల్లలను తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసి అక్కడి స్థానికులు, Video వీడియోను చూసి నెటిజన్లు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఏసీలో పాము ఏంటి, అది పిల్లలను పెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఏసీని శుభ్రపరుచుతూ ఉండాలి, లేదంటే అప్పుడప్పుడు ఏసీని వాడుతూ ఉండాలి. ఏసీని వాడకుండా అలాగే వదిలేస్తే ఇదిగో పాములకు నిలయంగా మారుతుంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement