SLBC | ఎస్​ఎల్​బీసీ టన్నెల్​లోకి స్నిఫర్​ డాగ్స్​

SLBC | ఎస్​ఎల్​బీసీ టన్నెల్​లోకి స్నిఫర్​ డాగ్స్​
SLBC | ఎస్​ఎల్​బీసీ టన్నెల్​లోకి స్నిఫర్​ డాగ్స్​
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: SLBC | ఎస్​ఎల్​బీసీ టన్నెల్​ వద్ద సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతునే ఉన్నాయి. సొరంగం పనులు చేపడుతుండగా మట్టికూలి 8 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. వారందరు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అయితే వారి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మట్టి కూలిన ప్రదేశానికి చేరడానికి సహాయక బృందాలకు సాధ్యం కావడం లేదు. మధ్యలో నీరు ఉబికి వస్తుండటం, బురద ఉండటంతో అక్కడికి చేరుకోలేక పోతున్నారు.

SLBC | కేరళ నుంచి డాగ్స్​

సొరంగంలో మృతదేహాలను కనుక్కోవడానికి సహాయక బృందాల అభ్యర్థన మేరకు కేరళ ప్రభుత్వం రెండు స్నిఫర్​ డాగ్స్​ను పంపింది. ఇవి వాసన పసిగట్టి మృతదేహాల జాడ కనుక్కుంటాయని అధికారులు భావిస్తున్నారు. గతంలో కేరళలోని వయనాడ్​లో వరదలు ముంచెత్తినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కనుక్కోవడంలో ఈ డాగ్స్​ ఎంతో హెల్ప్​ చేశాయి. దీంతో ఎస్​ఎల్​బీసీ సొరంగంలో కూడా వాటి సేవలను వినియోగించుకోనున్నారు.

SLBC | కొనసాగుతున్న ఆపరేషన్​

సొరంగంలో కార్మికుల మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. డీపీఆర్​ డేటా ఆధారంగా తవ్వకాలు చేపడుతున్నారు. టన్నెల్​లో నీరు ఉబికి వస్తుండటంతో మోటార్ల ద్వారా బయటకు పంపుతూ రెస్క్యూ ఆపరేషన్​ కొనసాగిస్తున్నారు.

Advertisement