Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్ : Snow Fall | మార్చి ప్రారంభం నుంచే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి దాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు జమ్ము కాశ్మీర్లో మాత్రం ప్రజలు చలితో వణికిపోతున్నారు. మంచు కురుస్తుండటంతో అక్కడ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పర్వత ప్రాంతంలో కురుస్తున్న హిమపాతంతో బదేర్వా ప్రాంతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఆ సుందర దృశ్యాన్ని చూడటానికి ప్రజలు తరలి వస్తున్నారు.
Advertisement