
అక్షరటుడే, వెబ్‌డెస్క్ Sobhita Dhulipala : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో నాగ చైతన్య, శోభిత Sobhita జంట ఒకటి. సమంత Samantha నుండి విడిపోయిన తర్వాత శోభితని వివాహం చేసుకున్న నాగ చైతన్య ప్రస్తుతం ఆమెతో కలిసి షికార్లు కొడుతున్నాడు. ఇక పెళ్లి అనంతరం ఈ జంట ఎలా ఉంటుందనే అనుమానం చాలా మందికి ఉంటుంది. దీనిపై ఓ సందర్భంలో శోభిత మాట్లాడుతూ ..నాగ చైతన్య Naga Chaitanya భర్తగా రావడం తన అదృష్ణమని తెలిపింది. శోభిత Sobhita వచ్చిన వేళా విశేషంతో నాగ చైతన్య Naga Chaitanya తండేల్ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు ఫ్రీ కావడంతో తమ సినిమా షూటింగ్‌లకు కొంత గ్యాప్ ఇచ్చి హానీమూన్ పీరియడ్‌ను ఎంజాయ్ చేశారు.
Sobhita Dhulipala : ఇది వారి లవ్ స్టోరీ..
వీరిద్దరది హనీమూన్ ఫొటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేశాయి. ఇక రీసెంట్‌గా ఈ జంట ప్రఖ్యాత ‘వోగ్’ మ్యాగజైన్ కోసం ఫోజులిచ్చారు.ఈ ఫొటోలపై నెటిజన్లు తమదైనశైలిలో రియాక్ట్ అవుతూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. శోభిత Sobhita మగ రాయుడిలా పైన కూర్చుంటే .. ఆడపిల్లలా నాగ చైతన్య కింద కూర్చున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే వీటిని చైతూ, శోభితలు పెద్దగా పట్టించుకోరు అనుకోండి. ఇక ఇదిలా ఉంటే శోభిత ధూళిపాళ Sobhita Dhulipala రీసెంట్ గా వోగ్ మ్యాగజిన్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో శోభిత తమ లవ్ స్టోరీ, పరిచయం, ఇలా పలు విషయాల గురించి షేర్ చేసుకున్నారు.
ఒకరోజు తాను ఆస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్ నిర్వహించినప్పుడు తాను నాగచైతన్య Naga Chaitanya ను ఎందుకు ఫాలో అవడం లేదని ఓ నెటిజన్ అడిగాడు. ఆ తర్వాత చైతూ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే అతను ఫాలో అవుతున్న 70 మందిలో తాను కూడా ఉండటం చూసి షాకై, అతన్ని తిరిగి ఫాలో అయ్యాను అని ఆమె చెప్పుకొచ్చింది. ఆక ఆ తర్వాత ఇద్దరం చాటింగ చేసుకున్నాం. కామన్ ఇంట్రెస్ట్‌ల గురించి ముచ్చటించుకున్నాం. ఇద్దరి లవ్ స్టోరీ ఫుడ్‌తోనే మొదలైంది. చైతూ ఎక్కువగా సుషీ గురించి పోస్ట్ చేస్తుండగా, అది చూసి చాలా ఎట్రాక్ట్ అయ్యాను. ఇక 2022లో లంచ్ డేట్ కోసం చైతూ ముంబైకి వచ్చాడు. మా పేరెంట్స్‌ని కలిసాడు. అలానే నేను నాగార్జున గారిని కలిసాను. ఇక పెద్దలు ఒప్పుకోవడంతో ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అని చైతూ స్పష్టం చేశాడు.