అక్షరటుడే, ఇందూరు: CONGRESS ST CELL | ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ సామాజిక న్యాయం పాటించిందని ఆ పార్టీ కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా ఛైర్మన్ కెతావత్ యాదగిరి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సమ ప్రాధాన్యత దక్కిందన్నారు. పార్టీని నమ్ముకుని ఉన్నవారికి పదవులు దక్కుతాయనేందుకు శంకర్ నాయక్ ఎంపికే నిదర్శనమని తెలిపారు. సమావేశంలో మోపాల్ మాజీ అధ్యక్షుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.