Women's Day | మహిళలను గౌరవించినప్పుడే సమాజాభివృద్ధి
Women's Day | మహిళలను గౌరవించినప్పుడే సమాజాభివృద్ధి
Advertisement

అక్షరటుడే, ఇందూరు: Women’s Day | మహిళలను గౌరవించినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్​ హారతి పేర్కొన్నారు. నగరంలో తెలంగాణ మున్నూరుకాపు సంఘం ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళలకు సన్మాన కార్యక్రమానికి ఆమె ముఖ్య​అతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళలకు గౌరవం కల్పించినప్పుడే సమాజం ప్రగతి బాట పడుతుందన్నారు.

గౌరవ అతిథిగా హాజరైన మహిళా పోలీస్​స్టేషన్​ సీఐ సుంకరి శ్రీలత మాట్లాడుతూ ఇల్లు, బడి, గుడి ఈ మూడుస్థాయిల్లో మార్పు వచ్చినప్పుడే మహిళల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం వివిధ శాఖల్లో పని చేస్తున్నటువంటి మున్నూరు కాపు ఉద్యోగినులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు తోట రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బాపూర్​ రవి, గౌరవ అధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు, ముఖ్య సలహాదారులు ఆకుల ప్రసాద్, కోశాధికారి సురేష్, జీలకర్ర కిషన్, మహిళా కార్యదర్శి స్వర్ణలత, యెండల స్వప్న, ఉపాధ్యక్షులు రెంజర్ల నరేష్, హరిచరణ్, అబ్బాయి లింబాద్రి, కానాపురం శివ చరణ్, సాయికుమార్, సత్యనారాయణ, అబ్బాయి మోహన్, డాక్టర్ విశాల్ హాజరయ్యారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Women's Day | మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి