అక్షరటుడే, ఆర్మూర్‌ : నందిపేట మండలం వెల్మల్‌ గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్‌ గాధారి రాజలింగం(55) ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధలు పెరిగిపోవడంతో గత శుక్రవారం తన వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు సేవించగా.. గమనించిన కుటుంబీకులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందాడు. రాజలింగం ఐలాపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ డైరెక్టర్‌గా ఉన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నందిపేట పోలీసులు తెలిపారు.