అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nara Lokesh | ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ(TDP) ఆవిర్భావ వేడుకల్లో భాగంగా శనివారం ఆయన మాట్లాడారు. తాము రెడ్(Red Book)బుక్ తెరవగానే కొందరికి గుండెపోటు వచ్చిందని వ్యాఖ్యానించారు. మరికొందరు బాత్రూమ్లో జారి పడ్డారని పేర్కొన్నారు. వైసీపీ(YCP) అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ(TDP) నాయకులను వేధిస్తున్న వారి పేర్లు రెడ్‌బుక్(Red Book)లో రాస్తున్నామని గతంలో లోకేశ్ తెలిపారు.
Nara Lokesh | వరుస కేసులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలోని కీలక నేతలపై కేసులు నమోదు అవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రులు కొడాలి నాని, విడుదల రజనీపై కూడా కేసులు పెట్టారు. ఈ క్రమంలో ఇటీవల నాని అస్వస్థతకు గురికాగా గుండెపోటు(heart attack) వచ్చిందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే లోకేశ్(Lokesh) వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Nara Lokesh | కామెడీ పీస్‌లకు భయపడతామా?
లోకేశ్(Lokesh) మాట్లాడుతూ.. తాము గల్లీ రాజకీయాలు చూశామని, ఢిల్లీని శాసించామని పేర్కొన్నారు. అలాంటిది కామెడీ పీస్(Comedy Pieces)లకు భయపడుతామా అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు నాయుడు, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పలువురు సినీరంగానికి చెందిన వారిపై కూడా ఇటీవల కేసులు నమోదు అయ్యాయి. మరో 40 ఏళ్లు టీడీజీ జెండా(TDG flag)ను రెపరెపలాడిస్తామన్నారు.
Nara Lokesh | నాతోనే మార్పు రావాలి
మంత్రి లోకేశ్(Lokesh) మాట్లాడుతూ.. మూడు పర్యాయాలకు మించి ఒకే పదవిలో ఉన్నవారు ఆ స్థానాన్ని వదులు కోవాలని సూచించారు. తమ స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నారు. ఈ విషయంలో తనతోనే మార్పు మొదలు కావాలని ఆయన అన్నారు. యువతరానికి అవకాశాలు ఇవ్వడంతో పాటు పార్టీ(Party)ని బలోపేతం చేయడమే లక్ష్యంగా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.