అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather | రాష్ట్రంలో వాతావరణం విచిత్రంగా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు(Rains) పడుతుండగా.. మరి కొన్ని జిల్లాల్లో ఎండలు మండుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం rains in Telangana కురిసింది. సోమవారం కూడా ఆదివారం లాగే వాతావరణ ఉండనున్నట్లు వాతావరణ శాఖ Meteorological Department తెలిపింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు temperatures నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ weather report today తెలిపింది. మరోవైపు ఉక్కపోత అధికంగా ఉండనుంది. సెంట్రల్ తెలంగాణలో సైతం చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.