అక్షరటుడే, బాన్సువాడ: రైతుబీమా డబ్బుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. మద్యం మత్తులో డబ్బుల కోసం తల్లితో గొడవపడి కర్రతో కొట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన నస్రుల్లాబాద్‌ మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నస్రుల్లాబాద్‌ ఇంఛార్జి ఎస్సై వెంకట్ రావు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుర్కి గ్రామంలో అంజవ్వ భర్త గతేడాది చనిపోవడంతో రూ.ఐదు లక్షల రైతు బీమా డబ్బులు వచ్చాయి. వాటిలో కొన్ని కొడుకుకి ఇచ్చి ఇంకొన్ని డబ్బులను తన బ్యాంకులో పొదుపు చేసింది. మద్యానికి బానిసైన కొడుకు బ్యాంకులో వేసిన డబ్బుల కోసం తల్లిని వేధించాడు. ఆమె ఇవ్వకపోవడంతో మంగళవారం కర్రతో తల్లిని కొట్టి హతమార్చాడు. పోలీసులు బుధవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.