
అక్షరటుడే, వెబ్‌డెస్క్ Travel With Mother : ఈ ప్రపంచంలో ఎందరో దేవుళ్లు ఉన్నారు. ఎన్నో మతాలు ఉన్నాయి. ఎన్నో కులాలు ఉన్నాయి. కానీ, ప్రతి కొడుకు, కూతురుకు ప్రత్యక్ష దైవం అంటే మాత్రం తల్లిదండ్రులు అనే చెప్పుకోవాలి. ఈ రోజు మనం భూమి మీద ఉన్నామంటే దానికి కారణం ఖచ్చితంగా తల్లిదండ్రులే. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నారు. ఏదో గుడులకు వెళ్లి పూజలు చేసినా, చేయకున్నా, తల్లిదండ్రులను గౌరవిస్తే, వాళ్లను బాగా చూసుకుంటే చాలు అంటారు పెద్దలు.
కానీ, ప్రస్తుత జనరేషన్ ఎలా ఉందో తెలుసు కదా. తల్లిదండ్రులను ఎంత మంది బాగా చూసుకుంటున్నారు అని ఆరా తీస్తే 100 మందిలో ఒకరిద్దరు తప్పితే ఎవ్వరూ ఈరోజుల్లో తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవడం లేదు. కానీ, ఓ వ్యక్తి మాత్రం అందరికంటే భిన్నంగా చివరకు తన సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి తన తల్లి కోసం వేల కిలోమీటర్లు తన తండ్రి స్కూటర్ మీద తల్లిని తీసుకొని తిప్పుతున్నాడు.
Travel With Mother : ఆదర్శ కొడుకుకి పర్‌ఫెక్ట్ ఉదాహరణ ఈ కొడుకు
కృష్ణకుమార్ ది బెంగళూరు. ఇటీవల తన తండ్రి చనిపోయాడు. దీంతో తల్లి ఒంటరి అయింది. తండ్రినే తలుచుకుంటూ బాధపడుతూ ఉన్న తన తల్లిని చూసిన కృష్ణకుమార్, తన తల్లి కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు. వెంటనే తన సాఫ్ట్ వేర్ జాబ్ కు రాజీనామా చేశాడు. వెంటనే తన తల్లికి ఇష్టమైన తన తండ్రి చేతక్ స్కూటర్ ను తీసుకొని దేశంలో ఉన్న అన్ని టెంపుల్స్ కు తన తల్లిని తీసుకొని వెళ్తున్నాడు.
ఆ స్కూటర్ మీదనే ఇప్పటి వరకు వాళ్లు కొన్ని వేల కిలోమీటర్లు తిరిగారు. దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను కవర్ చేయడమే వాళ్ల పని. అలా ఇప్పటి వరకు 92 వేల కిమీలు స్కూటర్ పై తిరిగారు. తాజాగా కృష్ణకుమార్ తన తల్లిని తీసుకొని ఏపీలోని కాకినాడకి వచ్చారు. అప్పుడే మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ పంచుకున్నాడు కృష్ణకుమార్.