sourav ganguly | సౌర‌వ్ గంగూలీకి ఐసీసీలో కీల‌క ప‌ద‌వి.. ల‌క్ష్మ‌ణ్‌కి ఏ ప‌దవి ద‌క్క‌నుంది అంటే..!

sourav ganguly | సౌర‌వ్ గంగూలీకి ఐసీసీలో కీల‌క ప‌ద‌వి.. ల‌క్ష్మ‌ణ్‌కి ఏ ప‌దవి ద‌క్క‌నుంది అంటే..!
sourav ganguly | సౌర‌వ్ గంగూలీకి ఐసీసీలో కీల‌క ప‌ద‌వి.. ల‌క్ష్మ‌ణ్‌కి ఏ ప‌దవి ద‌క్క‌నుంది అంటే..!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: sourav ganguly | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ International Cricket Council (ఐసీసీ) మెన్స్ క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా Men’s Cricket Committee chairman మరోసారి టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీకి Former Indian team captain Sourav Ganguly ప‌ద‌వి ద‌క్కింది. అలానే ఈ కమిటీలో దాదా మాజీ టీమ్ మేట్ వీవీఎస్ లక్ష్మణ్ VVS Laxman కూడా సభ్యుడిగా కొనసాగనున్నట్లు ఐసీసీ తెలిపింది.

Advertisement
Advertisement

దుబాయ్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ICC Annual General Meeting.. గంగూలీని మరోసారి కమిటీ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. కాగా సౌరవ్ గంగూలీ 2000 నుంచి 2005 వరకు భారత జట్టు కెప్టెన్‌గా ఉన్న విష‌యం తెలిసిందే. నాలుగేళ్ల క్రితం అంటే 2021లో తొలిసారిగా ఐసీసీ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా Men’s Cricket Committee chairman ఎంపికయ్యాడు సౌర‌వ్ గంగూలీ.

sourav ganguly | అఫీషియ‌ల్…

గంగూలీకి ముందు ఆ పోస్ట్‌లో అనిల్‌ కుంబ్లే Anil Kumble ఉండేవాడు. ఆయన రాజీనామా చేశాక.. గంగూలీ చైర్మన్‌గా నియామకమయ్యారు. పదవీకాలం ముగియడంతో గంగూలీని మరోసారి క్రికెట్ ఛైర్మన్‌గా cricket chairman ఎంపిక చేశారు. ఈ మెన్స్ క్రికెట్ కమిటీలో men’s cricket committee దాదా, లక్ష్మణ్ తో పాటు మరి కొంత మంది కూడా సభ్యులుగా నియమితులయ్యారు. వీరిలో అఫ్గనిస్థాన్‌ మాజీ ప్లేయర్ హమిద్‌ హసన్‌, వెస్టిండీస్‌ బ్యాటింగ్ లెజెండ్ డెస్మండ్‌ హేన్స్‌ West Indies batting legend Desmond Haynes, సౌతాఫ్రికా టెస్ట్, వన్డే కెప్టెన్ టెంబా బవుమా ODI captain Temba Bavuma, ఇంగ్లాండ్‌ మాజీ బ్యాటర్ జొనాథన్‌ ట్రాట్‌ ఇతర సభ్యులుగా ఉన్నారు.

ఇక మహిళల కమిటీకి ఆఫ్‌ స్పిన్నర్‌ కేథరిన్‌ క్యాంప్‌బెల్‌ off-spinner Catherine Campbell నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన అవ్రిల్ ఫహే Avril Fahey, దక్షిణాఫ్రికా South Africa నుంచి ఫోలెట్సి మొసెకి సభ్యులుగా కొనసాగనున్నారు. దుబాయ్‌లో వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ ఎంపికలు జరిగాయి. అలానే ఈ సమావేశంలో ఉమెన్స్ క్రికెట్ కమిటీకి Women’s Cricket Committee కూడా ఛైర్మన్ ను నియమించారు.

న్యూజిలాండ్‌ మాజీ ఆఫ్ స్పిన్నర్ కేథరిన్‌ క్యాంప్‌బెల్‌ ఛైర్ పర్సన్‌గా ఎంపికైంది. ఇంకా ఈ మహిళల కమిటీలో ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ అవ్రిల్‌ ఫహే Avril Fahey, దక్షిణాఫ్రికాకు చెందిన మొసెకి సభ్యులుగా ఎంపికయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌ మహిళా క్రికెటర్లకు Afghanistan’s women cricketers సహాయం అందించేందుకు ఐసీసీ స్పెషల్‌ టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. ఉమెన్‌ క్రికెటర్లకు అవసరమైన వనరులు సమకూర్చడం. ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించేందుకు ఐసీసీ ఓ ప్రత్యేక నిధిని సైతం ఏర్పాటు చేయనున్నది.

Advertisement