అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న కుంభమేళాకు 140 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లలో సుమారు 1.3 లక్షల మంది రిజర్వ్డ్ ప్రయాణికులు ప్రయాణించారని పేర్కొంది. దేశవ్యాప్తంగా కుంభమేళా సందర్భంగా 13 వేలకు పైగా రైళ్లను నడపాలని రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించింది. వీటిలో 3,100ప్రత్యేక రైళ్లు, 10 వేల సాధారణ రైళ్లు ఉన్నాయి. మౌని అమావాస్య సందర్భంగా 150కిపైగా ప్రత్యేక రైళ్లను నడిపినట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 9న ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలోని ఎనిమిది వేర్వేరు రైల్వే స్టేషన్ల నుంచి రికార్డు స్థాయిలో 330 రైళ్లు నడిపినట్లు వివరించారు. ఆయా స్టేషన్ల నుంచి నాలుగు నిమిషాలకు ఒక రైలు నడుపుతున్నట్లు తెలిపారు. అవసరం మేరకు మరిన్ని ప్రత్యేక రైళ్ల నడపడానికి సౌత్ సెంట్రల్ రైల్వే సిద్ధంగా ఉందన్నారు.
Advertisement
Advertisement