అక్షరటుడే, వెబ్‌డెస్క్: శబరిమల వెళ్లే యాత్రికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీ దృష్ట్యా జనవరి మాసంలో ప్రత్యేకంగా 34 సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ -కొట్టాయం, కొట్టాయం – సికింద్రాబాద్, మౌలాలి-కొట్టాయం, కాచిగూడ – కొట్టాయం, మౌలాలి -కొల్లం మధ్య జనవరి 3 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి.