అక్షరటుడే, వెబ్ డెస్క్: దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం 44 ప్రత్యేక రైళ్లు నడపబోతోంది. డిసెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకు వివిధ తేదీల్లో విశాఖ, శ్రీకాకుళం నుంచి కొల్లంకు 44 ప్రత్యేక రైళ్లు సర్వీసులు అందించనున్నాయి. అలాగే కాచిగూడ – కొట్టాయం మధ్య డిసెంబర్ 5 నుంచి 27 వరకు ప్రతి గురు, శుక్రవారాల్లో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి.
- విశాఖపట్నం- కొల్లం విశాఖ ప్రత్యేక రైళ్లు (08539/40) డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 27 వరకు 26 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
- విశాఖ – కొల్లం ప్రత్యేక రైలు (08539) ప్రతి బుధవారం ఉదయం 8.20 గంటలకు విశాఖలో బయల్దేరి గురువారం మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లం చేరుకుంటుంది.
- కొల్లం – విశాఖ రైలు డిసెంబరు 5 నుంచి ఫిబ్రవరి 27 వరకు ప్రతి గురువారం కొల్లంలో రాత్రి 7.35 గంటలకు బయల్దేరి శుక్రవారం రాత్రి 11.20 గంటలకు విశాఖ చేరుకోనుంది.
- శ్రీకాకుళం రోడ్ – కొల్లం మధ్య 18 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
- శ్రీకాకుళం రోడ్- కొల్లం మధ్య డిసెంబరు 1 నుంచి జనవరి 27 వరకు 08553 నంబరు గల రైలు ప్రతి సోమవారం ఉదయం 6 కు శ్రీకాకుళం రోడ్ స్టేషన్లో బయల్దేరి సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి సోమవారం కొల్లంలో సాయంత్రం 4.30 కు బయల్దేరి.. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు శ్రీకాకుళం చేరుకోనుంది.
- కాచిగూడ- కొట్టాయం (07133) రైలు డిసెంబరు 5, 12, 19, 26 తేదీల్లో (ప్రతి గురువారం) మధ్యాహ్నం 3.40 కు కాచిగూడలో బయల్దేరి శుక్రవారం సాయంత్రం 6.50 కు కొట్టాయం చేరుకోనుంది.
- డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో (ప్రతి శుక్రవారం) 8.30 గంటలకు కొట్టాయం నుంచి తిరిగి బయల్దేరి మరుసటి రోజు (శనివారం ) రాత్రి 11.40 కు కాచిగూడ చేరుకుంటుంది. చేరుకోనుంది.
- హైదరాబాద్ – కొట్టాయం ప్రత్యేక రైళ్లు డిసెంబరు 3 నుంచి జనవరి 1 వరకు ప్రతి మంగళ, బుధవారాల్లో రాకపోకలు సాగిస్తాయి.
- హైదరాబాద్ – కొట్టాయం (07135) ప్రత్యేక రైలు మంగళవారం మధ్యాహ్నం 12 కు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4.10 కు కొట్టాయం చేరుకుంటుంది.
- కొట్టాయం – హైదరాబాద్ ప్రత్యేక రైలు బుధవారం సాయంత్రం 6.10 కు కొట్టాయం నుంచి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు హైదరాబాద్ వస్తుంది.