అక్షరటుడే, వెబ్‌డెస్క్: అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది. దీనికి సంబంధించి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. జనవరి 3, 10వ తేదీల్లో నాందేడ్-కొల్లాం(07159) వరకు ప్రత్యేక రైలు నడుస్తుంది. 5, 12వ తేదీల్లో కొల్లాం నుంచి నాందేడ్(07160) రైలు తిరిగి రానుంది. 17, 24వ తేదీల్లో సిర్పూర్ కాగజ్‌నగర్-కొల్లాం(07161)కు రైలు వెళ్లనుంది. కొల్లాం నుంచి 19, 26వ తేదీల్లో కొల్లాం-సిర్నూర్ కాగజ్‌నగర్(07162) రైలు తిరిగి రానుంది. అలాగే ఈనెల 13 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి.

