అక్షరటుడే, జుక్కల్ : కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ సోమవారం ఉదయం నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం మండలంలో క్రైం రేటు, రాత్రిపూట నిర్వహిస్తున్న పెట్రోలింగ్ తదితర వివరాలను తెలుసుకున్నారు. జుక్కల్ నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో పాటు జాతీయ రహదారి ఉన్నందున నైట్ పెట్రోలింగ్, విధులు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, నిజాంసాగర్ ఎస్సై సుధాకర్ ఉన్నారు.

Advertisement
Advertisement