అక్షర టుడే, కామారెడ్డి : పోలీసుశాఖకు చెందిన పనికిరాని వాహనాలు, వస్తువులకు ఈనెల 20న వేలం నిర్వహించనున్నట్లు ఎస్పీ సింధుశర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగానికి వీలులేని వాహనాలు, బైక్ టైర్లు, ట్యూబ్‌లు, ఇంజిన్ ఆయిల్, బ్యాటరీలు, ఇతర స్క్రాప్ సామగ్రిని జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో 20న ఉదయం 11 గంటలకు వేలం ఉంటుందని, ఆసక్తిగలవారు ఆధార్, ఇతర ఏదైనా గుర్తింపుకార్డు (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందినవి)తో పాల్గొనవచ్చని, వివరాలకు ఆర్ఎస్సై బాలరాజును 8712686114 ను సంప్రదించాలని సూచించారు.