అక్షరటుడే, నిజామాబాద్: జిల్లాలో ఇద్దరు ఆర్డీవోలు బదిలీ అయ్యారు. బోధన్ ఆర్డీవో రాజా గౌడ్ ఆర్మూర్ కు బదిలీ కాగా..అక్కడ పని చేస్తున్న వినోద్ కుమార్ ను భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేశారు. మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న సిదం దత్తు బోధన్ ఆర్డీవోగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.