అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అహ్మద్ మొహినుద్దీన్ తీర్పు వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు 17 మందిని పట్టుకున్నారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరుపర్చగా 15 మందికి 34వేల జరిమానా విధించారు. మరో ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు.