అక్షరటుడే, ఇందూరు: నగర శివారులోని ధర్మపురి హిల్స్‌లో వెలిసిన పంచముఖి లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ వ్యవస్థాపకులు ధర్మపురి ఆచారి మాట్లాడుతూ భక్తుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రత్యేక పూజల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.