అక్షరటుడే, ఇందూరు: Sports : జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు, సిబ్బందికి సోమవారం క్రీడా పోటీలను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి పోటీలు ప్రారంభించి మాట్లాడారు.
అధ్యాపకులలోని ప్రతిభని గుర్తించడానికి, ఉల్లాసమైన వాతావరణాన్ని కల్పించడం కోసం క్రీడలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ బాలమణి, అకడమిక్ కోఆర్డినేటర్ గంగాధర్, పరీక్షల నియంత్రణ అధికారి భరద్వాజ్, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ రామస్వామి, రాజేష్, ఉదయ భాస్కర్ పాల్గొన్నారు.