అక్షరటుడే, వెబ్డెస్క్ : Teachers Transfer | విద్యా సంవత్సరం ముగింపు వేళ పలువురు టీచర్ల Teachersకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో స్పౌజ్ spouse కేటగిరీ కింద బుధవారం 165 మంది ఉపాధ్యాయులను బదిలీ transfer చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
317 జీవోతో నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయడానికి జనవరి januaryలో ప్రభుత్వం 834 మందిని స్పౌజ్ బదిలీల్లో భాగంగా కోరుకున్న జిల్లాలకు పంపింది. తాజాగా మరో 165 మంది బదిలీలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు orders జారీ చేసింది. ఈ మేరకు డీఈవో DEOలకు ఉత్తర్వు కాపీలు అందాయి. బదిలీ అయిన ఉపాధ్యాయులు ఏప్రిల్ 22న కు రిలీవ్ అయి 23న వారికి కేటాయించిన జిల్లాలోని పాఠశాలలో జాయిన్ కావాలని అధికారులు ఆదేశించారు.