అక్షర టుడే, వెబ్ డెస్క్ Aniket Verma : ఐపీఎల్ (IPL) మ్యాచ్‌తో కొందరు ఆటగాళ్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రతి మ్యాచ్‌కి ఒక్కో ఆణిముత్యం వెలుగులోకి వస్తుంది. గతేడాది హైదరాబాద్ జట్టు ద్వారా నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) లైమ్ లైట్‌లోకి రాగా.. ఇప్పుడు అనికేత్ వర్మ (Aniket Verma) ఎస్ఆర్ హెచ్‌కి ట్రంప్ కార్డుగా మారాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) వంటి విధ్వంసకర బ్యాటర్లు నిండిన (Sunrisers Hyderabad) సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తాజా మ్యాచ్ లో అన్నివికెట్స్ కోల్పోయింది. అయితే ఈ ఏడాది ఎస్ఆర్ హెచ్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అనికేత్ వర్మ.. (Aniket Verma) తాను ఆడిన మూడో మ్యాచ్‌లోనే అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేశాడు.
Aniket Verma : అదిరిపోయే ఆణిముత్యం..
37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఎస్‌ఆర్‌హెచ్‌ను ఈ కుర్ర బ్యాటర్ ఆదుకున్నాడు. భారీ సిక్సులతో హడలెత్తించాడు. 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన అనికేత్ (Aniket Verma) తన కెరీర్‌లో ఎక్కువ మ్యాచ్‌లు మధ్యప్రదేశ్ తరఫున ఆడాడు. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతంగా ఆడి అందరి దృష్టినీ ఆకర్షించాడు. భోపాల్ లియోపోర్డ్స్ తరఫున ఆరు మ్యాచ్‌ల్లో 273 పరుగులు చేశాడు. ఒక మ్యాచ్‌లో 41 బంతుల్లో ఏకంగా 123 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టి (Aniket Verma) అనికేత్‌పై పడింది. అనికేత్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రూ.30 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. అవకాశం వచ్చినప్పుడు చెలరేగి తన సత్తా చాటాడు.
ఐపీఎల్‌లో (Aniket Verma) అనికేత్ తొలి అర్ధ సెంచరీ. తన అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లు కొట్టాడు. అయితే 16వ ఓవర్లో మెక్‌గర్క్ అద్భుతమైన క్యాచ్ తీసుకొని అనికేత్‌ను పెవిలియన్ పంపాడు. అనికేత్ మొత్తంగా 41 బంతులు ఎదుర్కుని 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. . 180 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అనికేత్.. అక్షర్ పటేల్, Akshar Patel, Kuldeep Yadav, కుల్దీప్ యాదవ్ లాంటి టాప్ బౌలర్లను కూడా వదిలిపెట్టలేదు. బౌండరీలు బాదడం మాత్రమే కాకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ అనుభవజ్ఞుడైన బ్యాటర్‌లా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. లేకపోతే హైదరాబాద్ టీమ్‌కు ఆ మాత్రం స్కోరు కూడా వచ్చేది కాదేమో.