అక్షరటుడే, వెబ్‌డెస్క్: SRH | సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు జూబ్లీహిల్స్(Jubleehills) పెద్దమ్మ తల్లిని (Peddamma Temple jubleehils) దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఐపీఎల్(IPL)లో తన మొదటి మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఎస్ఆర్హెచ్(SRH) దుమ్ము రేపింది. 286 పరుగుల భారీ స్కోర్ చేసి, ఘన విజయం సాధించింది.
అయితే తర్వాత మూడు మ్యాచుల్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ క్రమంలో శనివారం ఆ జట్టు ఆటగాళ్లు అభిషేక్ శర్మ(Abhishek Sharma), నితీశ్‌రెడ్డి(Nitish Reddy) పెద్దమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. వారికి ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కాయిన్(నాణేం) నిలబెట్టి తమ కోరిక నెరవేరాలని వేడుకున్నారు. కాగా సన్‌రైజర్స్ తదుపరి మ్యాచ్ ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. కాగా జట్టు గెలుపు కోసమే ఆటగాళ్లు అమ్మవారిని వేడుకున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.