అక్షరటుడే, ఆర్మూర్: Sri Chaitanya Students | ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్‌లో ఆర్మూర్ పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ఈ ఒలింపియాడ్ టెస్ట్(Olympiad Test)లో పాఠశాల నుంచి 207 మంది విద్యార్థులు క్వాలిఫై అయి ప్రత్యేక బహుమతులను గెలుపొందారు. అందులో 11 మంది ట్యాబ్‌లు(Tabs), స్మార్ట్ వాచ్‌లు(Smart Watches), బహుమతులు గెలుపొందారు. 133 మంది బంగారు పతకాలు(Gold medals) గెలుపొందారు. 4వ తరగతి చదువుతున్న మహాస్విన్(Mahaaswin) పవర్ గ్రాండ్ ప్రైజ్ అయిన లెనోవా ల్యాప్‌టాప్(Lenovo laptop)ను గెలుపొందారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ముత్తు నందిపాటి మాట్లాడుతూ జాతీయ స్థాయి(National level)లో ప్రతిభచూపిన విద్యార్థులు ఆర్మూర్ పేరును నిలబెట్టారన్నారు. కార్యక్రమంలో ఏజీఏం సతీష్‌రెడ్డి, ప్రిన్సిపల్ ముత్తు, కోఆర్డినేటర్ మహిపాల్ రెడ్డి, ప్రసన్న, డీన్ రాకేష్, ఇన్‌ఛార్జి రాజేశ్వర్ పాల్గొన్నారు.