అక్షరటుడే, ఆర్మూర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 41 వరద గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. జలాశయంలోకి ఎగువ నుంచి 2,81,405 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా వరద గేట్ల ద్వారా రెండు లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా నాలుగు వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4000 క్యూసెక్కులు, వరద కాలువకు 19 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 74.72 టీఎంసీల నీరు నిల్వ ఉంది.