
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aghori Sri Varshini Relation : తెలుగు రాష్ట్రాలలో కొద్ది రోజులుగా అఘోరి (Aghori) తన ప్రవర్తనతో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఆమె వరుసగా ఆలయాలకు వెళ్లి అక్కడ నానా హంగామా చేస్తూ వార్తలలో నిలుస్తుంది. అయితే కొద్దిరోజులుగా ఆమె పెద్దగా కనిపించడం లేదు.. కొద్దిరోజుల క్రితం శ్రీవర్షిణి(Sri Varshini) అనే యువతి అఘోరీకి జత కలిసింది. ఆమె తల్లిదండ్రుల్ని వదిలేసి అఘోరీ(Aghori) వెంటవెళ్లిందని ఆమె తల్లిదండ్రులు వాపోతున్నారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో అఘోరీపై ఫిర్యాదు అందింది. శ్రీ వర్షిణి(Sri Varshini) అనే అమ్మాయి కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఘోరీ (Aghori) తమ కూతురిని కిడ్నాప్ చేసిందని వారు ఆరోపించారు.
Aghori Sri Varshini Relation : అఘోరి అరాచకం..
గత కొన్ని రోజులుగా శ్రీ వర్షిణి (Sri Varshini) అఘోరీతోనే ఉంటోందని.. తన కూతురికి మత్తు మందు ఇచ్చి (Aghori) అఘోరీ తన వశం చేసుకుందని తండ్రి కోటయ్య ఆరోపిస్తున్నారు. (Sri Varshini) శ్రీ వర్షిణి కనిపించకుండా పోయిందని కోటయ్య మంగళగిరి పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. లేడీ అఘోరీ తమ కూతురిని కిడ్నాప్ చేసిందని.. శ్రీ వర్షిణి తమ మాట వినడం లేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు (Sri Varshini) శ్రీ వర్షిణి తమ దగ్గరకు రావడం లేదంటున్నారు తండ్రి కోటయ్య. శ్రీ వర్షిణి (Sri Varshini) అన్న విష్ణు కూడా అఘోరిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘అఘోరి నన్ను సెక్సువల్‌గా టార్చర్ పెట్టింది. (Aghori) అఘోరీ నన్ను లైంగికంగా వేధించింది.. ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడు మద్యం, కండోమ్‌లు తీసుకురమ్మని ఒత్తిడి చేసింది.
(Aghori) అఘోరీకి రాజకీయ నాయకులతో కూడా సంబంధాలు ఉన్నాయి. కొందరు నేతలు ఆమెకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు నా చెంపలు గిల్లడం, బుగ్గలు గిల్లడం చేసేది.. అలాగే నా బుగ్గలు కొరికింది. లేడీ అఘోరి అమ్మాయి కాదు.. మగ లక్షణాలు ఉన్న వింత జీవి’ అంటూ విష్ణు ఆరోపించాడు. నా చెల్లితో ఒంటరిగా కూర్చొని ఏదేదో చేసేది.. నా చెల్లికి ముద్దులు పెడుతూ ఇబ్బంది పెట్టేది. మా మీద పడి బుగ్గలు నిమిరేది.. ఇంట్లో ఉన్నన్ని రోజులు మమ్మల్ని లైంగికంగా వేధించింది. నా చెల్లి అఘోరి చెప్పినట్టే వింటుంది.. వాళ్లు ఒకే గదిలో ఉండేవారు.. ఆమె నా చెల్లిని వశం చేసుకుంది. నా చెల్లి మానసిక ఆరోగ్యం సరిగా లేదు.. అఘోరి మందు పెట్టి నా చెల్లిని వశం చేసుకుంది అంటూ శ్రీ వర్షిణి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
“అఘోరి.. నా బిడ్డను నాకిచ్చేయ్”… శ్రీవర్షిణి తల్లి ఆవేదన
అఘోరీ వద్ద నుంచి తమ కూతురిని ఎలాగైనా అప్పగించాలని కోరుతున్న తల్లి
శ్రీవర్షిణిని అఘోరి వశపరుచుకుని తమకు దూరం చేసిందని తల్లిదండ్రుల ఆరోపణలు
ఇప్పటికే మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన శ్రీవర్షిణి తండ్రి కోటయ్య… pic.twitter.com/RhcBpUKjij
— BIG TV Breaking News (@bigtvtelugu) March 25, 2025