The Paradise : గ్లింప్స్‌లో నాని రెండు జ‌డ‌ల వెన‌క ద‌ర్శ‌కుడి ఎమోష‌న‌ల్ క‌నెక్ష‌న్.. ట్విస్ట్ రివీల్ చేశాడుగా..!

Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: The Paradise : వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవ‌డంలో నాని ఎప్పుడు ముందే ఉంటారు. ఆయ‌న న‌ట‌న‌కి అభిమానులు నేచుర‌ల్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఇప్పుడు నాని.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్​లో ‘ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నాని బర్త్ డే స్పెషల్ గా మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఇన్నాళ్లూ ఎక్కువగా పక్కింటి అబ్బాయి తరహా పాత్రల్లో కనిపించిన నాని.. ఇందులో ఒక్కసారిగా రెండు జడల హెయిర్ స్టైల్​తో ఊర మాస్ లుక్​లో క‌నిపించి షాక్ ఇచ్చాడు.

The Paradise : ఇది ట్విస్ట్..

అయితే నాని లుక్‌పై తాజాగా శ్రీకాంత్ ఓదెల క్లారిటీ ఇచ్చాడు. నాని రెండు జడల లుక్​కి తన లైఫ్​తో ఎమోషనల్ కనెక్షన్ ఉందని శ్రీకాంత్ ఓదెల ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు. ”ఈ స్టేజ్​లో నేను ఈ లుక్ గురించి ఎక్కువ చెప్పలేను కానీ జడలకు నా జీవితంతో ఎమోషనల్ కనెక్షన్ ఉందని చెప్ప‌ద‌ల‌చుకున్నాడు. చిన్నప్పుడు అయిదేళ్ల వయసు వ‌ర‌కు నా తల్లి న‌న్ను అలాగే పెంచిందని, ఆ స్ఫూర్తితోనే ప్యారడైజ్​లోని నాని పాత్రను డిజైన్ చేసుకున్న‌ట్టు చెప్పుకొచ్చాడు శ్రీకాంత్ ఓదెల‌. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇంత క‌న్నా ఎక్కువ ఏం చెప్ప‌లేను. షూటింగ్ మొదలయ్యాక సందర్భం ఆధారంగా ఒక్కో విష‌యాన్ని పంచుకుంటానని అక్కడితో ఆ టాపిక్ కి పులిస్టాప్ పెట్టాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  Nani : నానికి తల్లిగా రమ్యకృష్ణ నో చెప్పిందా.. రీజన్ తెలిస్తే షాక్ అవుతారు..?

ఇప్పటిదాకా నాని కెరీర్​లో చూడనంత వయెలెన్స్ ప్యారడైజ్​లో ఉండబోతోందని గ్లింప్స్ చూశాక అర్ధ‌మ‌వుతోంది. ప్రతి సినిమాలో జీవితంలోని పాజిటివ్ సైడ్ నుండి వచ్చిన క్యారెక్టర్స్​ను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ సినిమాలో నేను డార్క్ క్యారెక్టర్స్, ఎమోషన్స్ ఆవిష్కరించబోతున్నాను. చీకటి ప్రపంచంలోని వ్యక్తులను, వారి జీవితాలను చూపించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా శ్రీకాంత్ తెలియ‌జేశాడు. ఈ సినిమా కోసం నాని చాలా ఎక్కువ కష్టపడుతున్నాడు. దాదాపు రెండు నెలలుగా కరాటే నేర్చుకుంటున్న‌ట్టుగా తెలిపాడు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందనుందని ప్రచారం జరుగుతోంది. 2026 మార్చి 26న శ్రీరామనవమి సందర్భంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లుగా తెలిపారు.

Advertisement