అక్షరటుడే, విజయవాడ: Vijayawada | ప్రఖ్యాత గాయకుడు, ట్రిపుల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డా గజల్ శ్రీనివాస్ Dr. Ghazal Srinivas శ్రీమద్ భగవద్గీతను Bhagavad Gita తెలుగు ఆడియో రూపంలో Telugu audio format రూపొందించారు. శుక్రవారం ఆయన తన స్వగ్రామం పాలకొల్లులో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం audio launch program నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 25 భాషల్లో 25 languages రికార్డింగ్‌లు పూర్తయ్యాయని, ప్రపంచ భాషలన్నిటిలో రూపొందించడమే తన లక్ష్యమన్నారు. ఈ ఆడియో రికార్డింగ్‌లను యూట్యూబ్ YouTube ఇతర మీడియా ప్లాట్‌ఫాంల media platforms ద్వారా ఉచితంగా యాక్సెస్ చేయవచ్చన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, గుమ్మడి గోపాల కృష్ణ, రసరాజు, తదితరులు పాల్గొన్నారు.