Nizamabad DPO | నిజామాబాద్​ డీపీవోగా శ్రీనివాస్​

Nizamabad DPO | నిజామాబాద్​ డీపీవోగా శ్రీనివాస్​
Nizamabad DPO | నిజామాబాద్​ డీపీవోగా శ్రీనివాస్​
Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad DPO | నిజామాబాద్​ డీపీవోగా డి.శ్రీనివాస్​గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి నుంచి ఆయన ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా డీపీవోను సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బోధన్​ డివిజినల్​ పంచాయతీ అధికారిగా ఎస్​.నాగరాజు బాధ్యతలు చేపట్టారు.

కాగా.. నిజామాబాద్ డీపీవో పోస్టు కొద్ది రోజులుగా ఖాళీగా ఉంది. తాజాగా పంచాయతీరాజ్​ శాఖ శ్రీనివాస్​ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల (సర్పంచ్​) ఎన్నికలు జరిపేందుకు సర్కారు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఈ పోస్టును భర్తీ చేసినట్లు సమాచారం.

Advertisement