అక్షరటుడే, ఇందూరు: నవీపేట్ ప్రధాన రైల్వేగేట్ జనవరి 1 వరకు మూసి ఉంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 30న రైల్వే గేటును తెరవాల్సి ఉండగా.. అదనపు పనులు చేపడుతున్నందున మరో రెండు రోజులు పొడిగించినట్లు పేర్కొన్నారు. జనవరి 1న అర్ధరాత్రి గేటును తెరుస్తామని ప్రకటించారు. నిజామాబాద్-బాసర మార్గంలో వెళ్లే ద్విచక్ర వాహనదారులు కమలాపూర్, మహంతం, మోకన్‌పల్లి, గుండారం మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే ఇతర వాహనాలు కల్యాపూర్, సాటాపూర్, తాడ్ బిలోలి, ఫకీరాబాద్ మీదుగా రాకపోకలు సాగించాలని సూచించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  MMTS expansion | ఆ ప్రాంతాల వారికి శుభవార్త..MMTS విస్తరణకు కేంద్రం ఆమోదం!