అక్షరటుడే, బోధన్: సాలూర ఎంపీడీవోగా శ్రీనివాస్​ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన మండల కేంద్రంగా ఏర్పాటైన సాలూరకు ఇన్​చార్జి ఎంపీడీవోగా రెంజల్​ ఎంపీడీవో ఆఫీస్​లో సూపరింటెండెంట్​గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్​ను ఇటీవల ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.