అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఈ మేరకు భక్తులకు జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల ఎలక్ట్రానిక్ డీఐపీ రిజిస్ట్రేషన్లు ఈ నెల 18 ఉదయం పది గంటల నుంచి అందుబాటులో ఉంటాయని టీటీడీ(TTD) ప్రకటించింది. ఈ నెల 20 ఉదయం 10 గంటల వరకు తెరిచి ఉంటాయి.
జూన్(June) నెలకు సంబంధించిన కల్యాణం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార వంటి సేవలకు అర్జిత సేవా టిక్కెట్ల కోటా బుకింగ్ కోసం ఈ నెల 21న ఉదయం పది గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో ఈ సేవల్లో (వర్చువల్ పార్టిసిపేషన్) పాల్గొనేందుకు దర్శన కోటా బుకింగ్(Booking) కోసం 21న మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.
Tirumala | అంగ ప్రదక్షిణం టోకెన్లు..
తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్లు 22 ఉదయం 10 గంటల నుంచి, సీనియర్ సిటిజన్లు, శారీరకంగా వికలాంగుల కోటా బుకింగ్ 22న మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
Tirumala | ప్రత్యేక దర్శనం కోటా
జూన్ నెలకు సంబంధించి స్పెషల్ ఎంట్రీ దర్శనం(రూ.300) టిక్కెట్లు ఈ నెల 24 ఉదయం 10 గంటల నుంచి, వసతి కోటా బుకింగ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.200/-) ఏప్రిల్(April) టిక్కెట్లు 24న ఉదయం నుంచి బుక్ చేసుకోవచ్చు. టీటీడీ – స్థానిక దేవాలయాల ఏప్రిల్ సేవా కోటా ఈ నెల 25 ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు.