అక్షరటుడే, ఆర్మూర్: SRSP | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ డ్యాం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. డ్యాంపై రోడ్డు పొడవునా మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. రాత్రివేళల్లో మందుబాబులు చేరి బహిరంగంగా మద్యం తాగుతున్నారు.
ఇదివరకు పోలీసులు డ్యాంపై ప్రతిరోజు పెట్రోలింగ్ నిర్వహించేవారు. కానీ, ప్రస్తుతం నిఘా తగించారు. ఫలితంగా టూరిజం స్పాట్ గా ఉండాల్సిన ప్రాంతం.. చీకటి పడగానే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. ఇది ఇతర పర్యాటకులకు ఇబ్బందిగా మారింది.
SRSP : సూసైడ్ ఘటనలు..
డ్యాంపై పోలీసుల నిఘా తగ్గడంతో పలువురు ఇక్కడే తిష్ట వేస్తున్నారు. కొందరు వివిధ కారణాలతో డ్యాం పైనుంచి ప్రాజెక్టులోకి దూకి సూసైడ్ చేసుకుంటున్నారు. గతంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి డ్యాం పైకి ప్రైవేటు వ్యక్తులు వెళ్లకుండా కట్టడి చేసేవారు. తిరిగి నిఘా పెంచాలని పలువురు కోరుతున్నారు.