
Mahesh Babu : ఆర్ఆర్ఆర్ సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా గురించి దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ కథతో వస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే అతి పెద్ద సినిమా అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు దాటుతుంది. తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని జక్కన్న తెరకెక్కించబోతున్నారు. ఇప్పుడు ఈ సినిమా రెండో షెడ్యూల్ ఈ వారంలో మొదలు కానుంది.హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నెల రోజుల కిందట రాజమౌళి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు.
Mahesh Babu : రిస్క్ చేయబోతున్న మహేష్..
ఇప్పుడు ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ కోసం రాష్ట్రాన్ని దాటేశారు. తాజా షెడ్యూల్ షూట్ కోసం ఒడిస్సాకి బయల్దేరారు. అక్కడ కొన్ని ఉత్కంఠభరితమైన సీన్లు షూట్ చేస్తారని సమాచారం అందుతుంది. ఇక వీరు వెళ్లే ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. అందులో మహేశ్ బాబు భార్య నమ్రత.. అతడికి సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్లు కనిపిస్తుంది. ఇకపోతే ఈ మూవీలో మహేశ్ సరసన.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది.. రాజమౌళి ఈ చిత్రాన్ని హాలీవుడ్ మూవీ ‘ఇండియానా జోన్స్ సిరీస్’ను పోలి ఉండేలా తెరకెక్కించనున్నట్టు అర్ధమవుతుంది.
తాజా షెడ్యూల్‌లో మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాతో పాటు కొందరు నటీనటులు కూడా షూటింగ్‌లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో అని అభిమానులు తెగ ముచ్చటించుకుంటున్నారు. చిత్రానికి గరుడ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుండగా, ఇందులో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించి సందడి చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీతో మహేష్ బాబు క్రేజ్ ఎల్లలు దాటడం ఖాయం అంటున్నారు.ఇక ఈ సినిమా కోసం ట్రెకింగ్ చేయడానికి వీలైన అటవీ ప్రాంతాలని రాజమౌళి, అతని టీమ్ జల్లెడపడుతుంది.