అక్షరటుడే, బోధన్: పట్టణంలో సోమవారం రాత్రి కత్తిపోట్ల ఘటన చోటు చేసుకుంది. యువకుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ కత్తి పోట్లకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో ఒకరిని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి, మరొకరిని హైదరాబాద్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. గాయపడిన యువకులు షోయబ్, సోహైల్, తన్వీర్ గా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.