గౌతంనగర్ లో కత్తిపోట్ల కలకలం

0

అక్షరటుడే, నిజామాబాద్: నగరంలోని గౌతంనగర్ లో ఆదివారం రాత్రి కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. స్థానికంగా నివాసం ఉండే యువకులు పవన్, చందు, చిన్ను యాదవ్ మద్యం మత్తులో గొడవపడ్డారు. పవన్ కు గాయాలవ్వగా నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో చందు, చిన్నూతో పాటు అతని తల్లి పవన్ ఇంటికి వెళ్ళారు. మళ్లీ గొడవకు దిగారు. ఇదే సమయంలో చిన్నూ యాదవ్ తల్లి రేణుక తనవెంట తెచ్చుకున్న కత్తితో పవన్ పై దాడిచేసింది. అనంతరం కుటుంబీకులు బాధితుడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.