పాన్ మసాలా యాడ్ చేసిన ఆ హీరోలకు షాక్..!

పాన్ మసాలా యాడ్ చేసిన ఆ హీరోలకు షాక్..!
పాన్ మసాలా యాడ్ చేసిన ఆ హీరోలకు షాక్..!
Advertisement

బాలీవుడ్ స్టార్స్ ఎక్కువగా వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తారు. తాము ప్రమోట్ చేసే వాటి విషయంలో కొన్ని ప్రజల అనారోగ్యానికి సంబందించినవి అయినా వాళ్లు ఏమి పట్టించుకోరు. ముఖ్యంగా పాన్ మసాలా యాడ్ తో వారు కోట్లకు కోట్లు సంపాదిస్తారు. ఈ క్రమంలో ఒక కొత్త పాన్ మసాలా యాడ్ గురించి బాలీవుడ్ స్టార్స్ కి షాక్ ఇస్తూ జైపూర్ లో వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.

బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ లకు ఈ కమిషన్ నోటీసులు పంపించింది. వీరు ప్రచారం చేస్తున్న పాన్ మసాలా యాడ్ లో వారు చెప్పినట్టుగా అందులో కేసరి లేదని ఫిర్యాదు చేశారు. ఈ ప్రకటన ప్రజలను తప్పుదారి పట్టిస్తందని ప్రజల అనారోగ్యానికి కారణమయ్యే గుట్కా ఉత్పత్తిని వారు ప్రమోట్ చేస్తున్నారని జైపూర్ కు చెందిన లాయర్ యోగేంద్ర సింగ్ బడియాల్ కోర్ట్ లో ఫిర్యాదు చేశారు.

పాన్ మసాలా యాడ్ లో దానె దానె మే కేసర్ కా దమ్..

పాన్ మసాలా యాడ్ లో దానె దానె మే కేసర్ కా దమ్ అంటూ చెప్పే ఆ ఉత్పత్తిలో అసలు కేసర్ అదే సాఫ్రన్ ఉండదని ఫిర్యాదు దారుడు ఆరోపించాడు. మార్కెట్ లో కేసర్ ధర లక్షల్లో ఉండగా 5 రూపాయల పాన్ మసాలాలో ఎలా ఉంటుందని ఆయన ఫిర్యార్దులో పేర్కొన్నారు. స్టార్స్ తమ డబ్బు కోసం ఇలాంటి ప్రకటనలు చేస్తారని దాని వల్ల ప్రజలు అనారోగ్య బారిన పడతారని రాసుకొచ్చారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Janhvi Kapoor | బ‌ర్త్ డే రోజు జాన్వీ క‌పూర్ కేక పెట్టించే అందాల‌తో చంపేస్తుందిగా..!

అంతేకాదు ఈ కేసులో కేవలం యాక్టర్స్ నే కాకుందా వాణిజ్య సంస్థ జేబీ ఇండస్ట్రీస్ ఓనర్ విమన్ కుమార్ అగర్వాల్ పేరుని మెన్షన్ చేయగా ఆయనకు కోర్టు నోటీసులు పంపిచింది. మార్చి 19న వీరు న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉంటుంది. అంతేకాదు నోటీసులు అందుకున్న స్టార్స్ 30 రోజుల్లోగా స్పందించాలని కమిషన్ ఆదేశాలు చేసింది. సో పాన్ మసాలా యాడ్ బాలీవుడ్ స్టార్స్ కి కొత్త తలనొప్పి తెచ్చి పెట్టిందని చెప్పొచ్చు. మరి ఈ కేసు ఎక్కడిదాకా వెళ్తుంది అన్నది చూడాలి.

Advertisement