అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడలో 100 పడకల ఏరియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనానికి రూ.37.50 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, శ్రీనివాస్ ప్రసాద్ తదిరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement