అక్షరటుడే, బాన్సువాడ: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తుందని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని తాడ్కోల్‌లో ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, సొసైటీ ఛైర్మన్ గంగుల గంగారాం, నార్ల సురేష్ గుప్తా, ఎజాజ్, శ్రీధర్, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, హకీమ్, రాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement