అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ప్రభుత్వం వేసిన సబ్‌కమిటీ రిపోర్ట్ తర్వాతే రైతు భరోసా అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ లో మాట్లాడుతూ.. సబ్‌కమిటీ రిపోర్ట్ ఇచ్చాక క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాబోయే పంటకాలం నుంచి రైతు భరోసా 7,500 చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.