అక్షరటుడే, కామారెడ్డి : వీవోఏల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు పఠాన్‌ గౌస్‌ఖాన్, మాలోత్‌ శివరాంనాయక్‌ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. వీవోఏల సమస్యలను కలిసికట్టుగా దశలవారీగా పరిష్కరించుకుందామన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల అధ్యక్షులు పోశన్న, కిషోర్, ప్రభావతి రెడ్డి, మల్లేష్‌ యాదవ్, ఖండేరావు, పద్మక్క, రమేష్, భూలక్ష్మి, రమేష్, కృష్ణ శ్రీకాంత్, సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు షఫీయొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.