ఏటీఎం కొల్లగొట్టి.. నగదు దోచుకెళ్లి..

0

అక్షరటుడే, బోధన్: రుద్రూర్ మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో చోరీ జరిగింది. బుధవారం అర్ధరాత్రి ఏటీఎం గదిలోకి చొరబడిన దుండగులు యంత్రాన్ని ధ్వంసం చేశారు. ఏటీఎం మిషన్ పరికరాలను వేరు చేసి వాటిని రోడ్డుపై పారేశారు. అనంతరం అందులోని సుమారు రూ.25 లక్షల నగదు దోచుకెళ్లారు. పక్కా పథకం ప్రకారం గ్యాస్ కట్టర్ల సాయంతో దోపిడీకి పాల్పడి ఉండవచ్చని తెలుస్తోంది. ఏటీఎం గదిలో అలారం ఉన్నప్పటికీ పని చేయలేదు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి దోపిడీకి పాల్పడ్డారు. గతంలోనూ ఈ తరహా ఘటన ఇందల్ వాయి పీఎస్ పరిధిలో జరిగింది. హారియాణా లేదా యూపీ ముఠా దోపిడీ చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై రుద్రూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.