అక్షరటుడే, హైదరాబాద్: Telangana Debt : 2026 మార్చి నాటికి రాష్ట్ర అప్పులు రూ.7.46 లక్షల కోట్లకు చేరనున్నాయట. ఇందులో గత పదేళ్లలో చేసిన అప్పులతో పాటు కాంగ్రెస్ సర్కారు ఏడాదిన్నర కాలంగా చేసినవి కూడా ఉన్నాయి.
Telangana Debt : మరింత అప్పు..
2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.69,639 కోట్ల మేర అప్పులు తీసుకోవాలని రాష్ట్ర సర్కారు ప్రతిపాదించింది. ఈ మొత్తం కూడా ఎస్ఆర్ బీఎం పరిధిలోనే తీసుకోనున్నట్లు సమాచారం. తద్వారా FRBM పరిధిలో ఉన్న అప్పుల మొత్తం రూ.5.04 లక్షల కోట్లకు చేరనుంది. జీఎస్టీపీలో ఈ మొత్తం 28.1 శాతం కావడం గమనార్హం.
Telangana Debt : నెలకు రూ. 5,500 కోట్ల చెల్లింపులు
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత 14 నెలల కాలంలో గ్యారంటీ అప్పులు తీసుకోలేదు. కానీ, గత భారాస సర్కారు గ్యారంటీ కింద వివిధ కార్పొరేషన్లు, ఇనిస్టిట్యూషన్ల (స్పెషల్ పర్పస్ వెహికల్స్) నుంచి తీసుకున్న అప్పులు రూ. 2,41,528 కోట్లు. వీటి నెలవారీ కిస్తీ, వడ్డీలకు కలిపి సుమారు రూ.5,500 కోట్ల చెల్లింపులు ఉంటాయి.
Telangana Debt : ఆదాయంలో 35 శాతం అప్పులకే చెల్లింపులు
2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ కిస్తీలు, వడ్డీల చెల్లింపులు రూ.605 కోట్లతో మొదలై, 2024-25 నాటికి రూ.60 వేల కోట్లు దాటాయి. రాష్ట్ర ఆదాయంలో సింహభాగం(35 శాతం) అప్పుల చెల్లింపులకే పోతున్నాయి. ఇక రానున్న ఆర్థిక సంవత్సరంలో భారీగానే చెల్లింపులు చేయాల్సి ఉండబోతోంది. కిస్తీలకు రూ.47 వేల కోట్లు, వడ్డీలకు రూ.19,369 కోట్ల వరకు చెల్లించాల్సిన దుస్థితి ఉండనుంది.
Telangana Debt : రాష్ట్రంపై రుణభారం(FRBM పరిధిలో)(కోట్ల రూ.లలో)
సంవత్సరం – అప్పు
2014-15 – రూ.83,845
2015-16 – రూ.93,115
2016-17 – రూ.1,29,531
2017-18 – రూ.1,52,190
2018-19 – రూ.1,75,281
2019-20 – రూ.2,05,858
2020-21 – రూ.2,44,019
2021-22 – రూ.3,21,612
2022-23 – రూ.3,56,486
2023-24 – రూ.4,03,664
2024-25 – రూ.4,51,203
2025-26 – రూ.5,04,814(అంచనా)