అక్షరటుడే, ఎల్లారెడ్డి: గురుకుల, కస్తూర్బా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు జ్యోత్స్న పేర్కొన్నారు. లింగంపేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో శుక్రవారం ఆమె రాత్రి బస చేశారు. శనివారం ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. పప్పు దినుసులు, బియ్యాన్ని, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డిస్తుండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ప్రత్యేక అధికారిణి వాసంతి, ఉపాధ్యాయులున్నారు.