అక్షరటుడే, కామారెడ్డి: రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం మద్నూర్‌ మండలంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఏఎంసీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత కౌలాస్‌ ప్రాజెక్టును సందర్శించి, మధ్యాహ్నం 12:15 గంటలకు నిజాంసాగర్‌ ప్రాజెక్టు, 1:15 గంటలకు లింగంపేట మండలంలో నాగన్నబావిని సందర్శించనున్నారు. అనంతరం నాగిరెడ్డిపేట మండలంలోని త్రిలింగ రామేశ్వరస్వామి ఆలయం, పోచారం ప్రాజెక్టు పరిశీలన చేయనున్నారు.