అక్షరటుడే, ఇందూరు: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ గంగారెడ్డి తెలిపారు. గురువారం ముబారక్ నగర్ లోని ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఎంఈవో, ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణ కార్యక్రమాల ద్వారా ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. అంతకుముందు కార్యక్రమాన్ని డీఈవో దుర్గాప్రసాద్ ప్రారంభించారు. సెలవు నిబంధనలు, రికార్డులు, కాంప్లెక్స్ హెచ్ఎంల విధులు, ట్రెజరీ బిల్లుల తయారీ, వెబ్ సైట్ల నిర్వహణ తదితర అంశాలపై వివరించారు. కార్యక్రమంలో సీనియర్ హెచ్ఎంలు శంకర్, సూర్య కుమార్, మధుసూదన్, గంగాధర్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్, డీసీఈబీ కార్యదర్శి సీతయ్య తదితరులు పాల్గొన్నారు.