అక్షరటుడే, ఇందూరు: రెడ్ క్రాస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. బుధవారం రాజభవన్లో రెడ్ క్రాస్ రాష్ట్ర పాలకమండలి, జిల్లా చైర్మన్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ కుటుంబంలో తాను ఒక సభ్యుడిని కావడం ఆనందంగా ఉందన్నారు. డ్రగ్స్ పై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, యువతను అప్రమత్తం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ పాల్గొన్నారు.